ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కేసీఆర్ అన్నా.. మేం హైదరాబాద్​ ఆస్పత్రికి రాకూడదా?'

'కేసీఆర్​ అన్నా.. విభజన సమయంలో మీరూ మేం ఒక్కటే అన్నారు.. ఇప్పుడేమో.. కనీసం ఆస్పత్రికి వద్దామంటే.. రానివ్వట్లేదు. జగనన్నా.. మీరేమో అన్నీ ఉచితమన్నారు.. ఇప్పుడేం చేస్తున్నారు.. నా భర్తకు ప్రాణభిక్ష పెట్టండి..' అంటూ... తన భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ మహిళ ఆవేదనతో అన్న మాటలివి. తెలంగాణ సరిహద్దులో తమను అడ్డుకున్న పోలీసుల తీరుపై.. ఆ మహిళ ఆగ్రహించింది. చివరకు.. తెలంగాణ ఉన్నతాధికారులతో సంప్రదించిన ఆ పోలీసులు.. వారిని తమ రాష్ట్రంలోకి అనుమతించారు.

mahabubnagar-police-stop-ananthapuram-patient
mahabubnagar-police-stop-ananthapuram-patient

By

Published : May 10, 2021, 4:27 PM IST

Updated : May 11, 2021, 3:27 AM IST

అనంతపురానికి చెందిన ఈశ్వర్ రెడ్డికి కరోనా సోకింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో హైదరాబాద్​కు తీసుకెళ్లాలని అతడి భార్య నిర్ణయించారు. హైదరాబాద్​లో ఉంటున్న తన కుమారుడికి విషయం చెప్పారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో పడక కోసం ప్రయత్నించారు. ఓ ఆసుపత్రిలో ఈశ్వర్ రెడ్డికి పడక కేటాయించారు. ఎలాగైనా సరైన వైద్యం చేయించాలని.. తన భర్తను తీసుకుని ఆమె బయల్దేరింది. తెలంగాణ సరిహద్దులో రాగానే జోగులాంబ గద్వాల్ జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్దే.. ఆ రాష్ట్ర పోలీసులు అంబులెన్స్​ను నిలిపేశారు. ముందుకు వెళ్లడానికి అనుమతించలేదు. ఎందుకు ఆపేస్తున్నారని.. ఈ విషయం తమకు ముందుగా చెప్పలేదని.. ఆమె పోలీసులను వేడుకున్న తీరు.. తీవ్రంగా కలచివేస్తోంది.

"మాది అనంతపురం.. మమ్మల్ని హైదరాబాద్​కు వెళ్లమన్నారు. అక్కడ క్రిటికల్ అని రాసిచ్చారు. ఇక్కడ చూస్తే.. మమ్మల్ని ఆపేశారు. ఆ విషయం మాకు తెలియదు. నేను మహిళను.. ఏం చేయాలో తెలియట్లేదు. మా కుమారుడు అక్కడే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడి దగ్గరికైనా వెళ్లాల్సిందే కదా. ఇదేం అన్యాయం.. అప్పుడు విభజనప్పుడు.. అంతా ఒక్కటే అని నీతులు చెప్పారు. ఆసుపత్రుల్లో హైదరాబాద్​లో మాకు కూడా భాగం ఉంటుంది కదా. కనీసం అత్తగారింటికో.. పుట్టింటికో వచ్చినట్లు మాకూ ఉంటుంది హక్కు. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కేసీఆర్ అన్నా.. దయచేసి మాకు ప్రాణభిక్ష పెట్టండి. జగనన్నా.. మీరేం చేస్తున్నారు? అనంతపురంలో కనీసం వెంటిలేటర్ కూడా లేదు. అన్నీ ఉచితంగా ఇస్తున్నాం అంటున్నారు. డబ్బులు పెట్టినా.. దొరక్కట్లేదు. మా ప్రాణాలతో ఇద్దరూ కలిసి ఎందుకు చెలగాటం ఆడుతున్నారు? ఇలా మధ్యలో ఆపేస్తే.. కేసీఆర్​తో మాట్లడరా? మాకు రాజకీయలు కాదు.. ప్రాణాలు అవసరం.

- బాధిత మహిళ

ఎట్టకేలకు అనుమతి..

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ... తెలుగు రాష్ట్రాల సీఎంలపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తున్నామని పోలీసులను వేడుకున్నారు. చివరకు పోలీసులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపాక తెలంగాణలోకి అనుమతి ఇచ్చారు.

తెలంగాణ సీఎస్​తో చర్చించిన ఏపీ సీఎస్

తెలుగు రాష్ట్రాల మధ్య అంబులెన్స్‌లకు ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించేలా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మాట్లాడుకున్నారని...రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌సింఘాల్‌ తెలిపారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన అంబులెన్స్‌లను తెలంగాణ సరిహద్దుల్లో ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే తక్షణం స్పందించామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన పలు తీర్పుల్లోని పరిశీలనాంశాల్లో ఈ విషయం చాలా స్పష్టంగా ఉందన్నారు.

'కేసీఆర్ అన్నా... హైదరాబాద్​లో మేం ఆస్పత్రికి రాకూడదా?'

ఇదీ చదవండి:

9 నెలల వ్యవధిలో మూడు సార్లు కరోనా

Last Updated : May 11, 2021, 3:27 AM IST

ABOUT THE AUTHOR

...view details