అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సాయికుల్వంత్ మందిరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. వేదపఠనంతో వేడుకలు ప్రారంభించారు. నాదస్వరం, పంచవాద్యం, సంగీత కచేరి నిర్వహించారు. వేదపండితులు సాయి ఈశ్వర లింగాన్ని.. భజన మందిరం నుంచి సాయికుల్వంత్ మందిరంలోకి తీసుకొచ్చారు. మహాసమాధి చెంత శివలింగాన్ని కొలువుదీర్చి సాయి అష్టోత్తరం, మహారుద్రాభిషేకం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన అఖండ భజన.. రాత్రంతా నిర్విరామంగా కొనసాగుతూ శనివారం ఉదయానికి ముగిసింది.
పుట్టపర్తిలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
పుట్టపర్తి ప్రశాంత నిలయంలో శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరిపారు. సాయి ఈశ్వర లింగానికి అష్టోత్తరపూజ, మహారుద్రాభిషేకం నిర్వహించారు. రాత్రంతా అఖండ భజన చేశారు.
పుట్టపర్తిలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు