అనంతపురం జిల్లా గుడిబండ మండలం మద్దనకుంట గ్రామస్థులు మడకశిర పట్టణంలోని అంబేడ్కర్ కూడలి నుంచి పంచాయతీరాజ్ కార్యాలయం(పీఆర్) వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. గ్రామ సచివాలయం తమ ఊరిలోనే ఏర్పాటు చేయాలని పీఆర్ అధికారికి వినతి పత్రం అందజేశారు. స్థానికులతో పాటు సీపీఐ ఇన్ఛార్జ్ పవిత్ర, దళిత పరిరక్షణ సమితి అధ్యక్షుడు హనుమంతు పాల్గొన్నారు.
గుత్తేదారుడు చిచ్చురేపుతున్నాడు..
గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటి నుంచి మద్దనకుంట గ్రామంలోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయని నేతలు అన్నారు. గతంలో అక్కడ కొత్త భవన నిర్మాణానికి భూమి పూజ జరిగి పునాదులు కూడా నిర్మించారని గుర్తుచేశారు. ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కురుబరహళ్లిలో సచివాలయ భవన నిర్మాణ పనులు చేపట్టి, గుత్తేదారుడు రెండు గ్రామాల మధ్య చిచ్చురేపుతున్నాడని ఆరోపించారు. వెంటనే కాంట్రాక్టర్ను తొలగించి మద్దనకుంటలోనే సచివాలయ భవన నిర్మాణం చేపట్టాలని నాయకులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
హంద్రీనీవా కాల్వకు గండి... భారీగా నీటి వృథా