ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛన్ డబ్బు దొంగలు ఎత్తుకెళ్లారని వాలంటీర్ డ్రామా - మడకశిరలో పింఛన్ డబ్బు చోరీ వార్తలు

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో మూడో వార్డులో ఓ వాలంటీర్ పింఛన్ డబ్బు పొగొట్టుకుని...తనపై దాడి చేసి దొంగలు ఎత్తుకెళ్లారని నాటకం ఆడాడు. పోలీసులు విచారణ చేయగా డబ్బు ఎక్కడో పోయిందని..పింఛన్ పంపిణీ చేసేందుకు డబ్బు లేకపోవడంతో..అలా దాడి చేశారని నాటకమాడానని అన్నాడు.

madakasira  volunteer lied for pension money
మూడోవార్డు వాలంటీర్

By

Published : Oct 2, 2020, 8:29 AM IST

కళ్లలో కారం చల్లి పింఛన్ డబ్బును దొంగలు దోచుకెళ్లారని ఓ వాలంటీర్ నాటకం ఆడాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని మూడో వార్డులో జరిగింది. వాలంటీర్ ఈరప్ప ప్రభుత్వ ఆసరా పింఛన్ డబ్బును పంపిణీకి తీసుకెళుతుండగా... దారి మధ్యలో నలుగురు దాడి చేసి కళ్లలో కారంకొట్టి డబ్బు ఎత్తుకెళ్లారని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. జరిగిన ఘటనపై పోలీసులు విచారణ జరపగా.. వాలంటీర్​ ఈరప్ప నాటకం ఆడాడని కొన్ని గంటల్లోనే నిగ్గుతేలింది. ఈరప్పకు ఇచ్చిన 43 వేల రూపాయలు మార్గ మధ్యలో పోగొట్టుకున్నాడని సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపాడు. పంపిణీ చేసేందుకు డబ్బులు లేక అలా నటించాడని.... అతనిపై ఎవరూ దాడి జరపలేదని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details