ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎల్పీజీ గ్యాస్​ ట్యాంకర్ బోల్తా - murarayanapalli latest news

ఎల్పీజీ గ్యాస్​ ట్యాంకర్​తో వెళ్తున్న లారీ.. ఓ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. వాహనాన్ని అక్కడి నుంచి తొలగించకపోవటంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం-కర్ణాటక సరిహద్దు గ్రామంలో ప్రమాదం జరిగింది.

gas tanker over turns
బోల్తా పడిన గ్యాస్​ ట్యాంకర్​

By

Published : Oct 19, 2020, 2:42 PM IST

​అనంతపురం జిల్లా పరిధిలో.. కర్ణాటక సరిహద్దు గ్రామం మురారాయనపల్లి వద్ద గ్యాస్​ ట్యాంకర్​ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే చాలా సేపటి వరకు లారీని అక్కడి నుంచి తొలగించే చర్యలేవీ అధికారులు చేపట్టలేదు. ఏ క్షణాన ప్రమాదం ముంచుకొస్తుందోనని చుట్టుపక్కల గ్రామస్థులు ఆందోళన చెందారు.

మూడు నెలల క్రితం ఇదే ప్రాంతంలో గ్యాస్ లారీ బోల్తా పడింది. అప్పుడు గ్యాస్ లీక్ కావడంతో అధికారులు అప్రమత్తమై చుట్టుపక్కల గ్రామస్థులను అక్కడినుంచి సురక్షిత ప్రదేశానికి తక్షణమే తరలించారు. ప్రస్తుతం వారు అలసత్వం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details