ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమజంట ఆత్మహత్య - ప్రేమ జంట

పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని అనంతపురం జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాంతో బాధిత కుటుంబాలలో విషాదపుఛాయలు అలుముకున్నాయి.

ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

By

Published : Jul 21, 2019, 11:24 AM IST

Updated : Jul 21, 2019, 3:51 PM IST

అనంతపురం జిల్లా యాడికి మండలం, నగరూరు గ్రామానికి చెందిన వినోద్ కుమార్ నాయుడు (24), సుచరిత(22)ఇద్దరూ దూరం బంధువులే, అయినప్పటికీ బంధువుల మధ్య పొత్తు కుదరక పోవడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంభీకులు తెలిపిన వివరాల ప్రకారం... పెళ్లి విషయమై ఇరు కుటుంబాలలో తరుచూ గొడవలు జరుగుతుండేవి... నిన్న రాత్రి ఎవరూ లేని సమయంలో మొదట అబ్బాయి విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన బంధువులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో.... ప్రియుడి మరణవార్త విన్న ప్రియురాలు విషగుళికలు తీసుకుని ఆత్మ హత్యకు చేసుకుంది.

ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట
Last Updated : Jul 21, 2019, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details