Lorry washed away in flood stream: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో ఓ సిమెంట్ మిక్సర్ లారీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో.. పండమేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ సమయంలో లో లెవల్ వంతెన నుంచి ఓ సిమెంట్ మిక్సర్ లారీ వెళ్లడంతో.. నీటి ప్రవాహ ఉద్ధృతికి వంతెన పైనుంచి కిందికు పడి వరదలో కొట్టుకుపోయింది. నీటి ప్రవాహం బుక్కరాయసముద్రం చెరువు వద్దకు చేరుతుండటంతో.. చుట్టపక్కల గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలోకి వెళ్లాయి.
వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన లారీ... ఎక్కడంటే..? - అనంతపురం జిల్లా తాజా వార్తలు
Lorry washed away in flood stream: అనంతపురం జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బుక్కరాయసముద్రంలోని మరువవంక వద్ద లారీ పడిపోయింది. అందరూ చూస్తుండగానే ప్రవాహంలో చప్టా అంచుకు కొట్టుకుపోయిన లారీ.. నీటిలో ఒరిగిపోయింది.
వరదలో కొట్టుకుపోయిన లారీ