అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం రామానుజ పల్లి వద్ద ప్రమాదం (accident) జరిగింది. జాతీయ రహదారిపై ఎద్దులను తరలిస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఐదు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 7 ఎద్దులకు తీవ్రగాయాలయ్యాయి. లారీ అనంతపురం నుంచి చెన్నైకి వెళ్తుండగా ఈ ప్రమాదం (accident) జరిగింది.
రహదారిపై పడి ఉన్న ఎద్దుల మృతదేహాలను స్థానికులు జేసీబీ సహాయంతో తొలగించారు. గంట పాటు రహదారిపై రాకపోకలు స్తంభించాయి. బత్తలపల్లి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేశారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లినందునే.. అదుపు తప్పి బోల్తా పడిందని గుర్తించారు.