accident: అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన మరొకరిని అనంతపురం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు.
Accident : అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - అనంతపురం జిల్లా వార్తలు
09:57 February 23
మరమ్మతుకు గురైన మినీ లారీని మరో వాహనంతో తీసుకెళ్తుండగా ఘటన
కియా ఫ్యాక్టరీ వద్ద బొలెరో వాహనం మరమ్మతుకు గురవగా...దాన్ని మరో వాహనంతో అనంతపురం తీసుకొస్తున్నారు. రాప్తాడు రైస్ మిల్లు వరకు రాగానే గుర్తుతెలియని వాహనం.. ఈ రెండు వాహనాలను ఢీ కొట్టింది. బొలెరో వాహనాలలో ఉన్న డ్రైవర్లు మల్లికార్జున, పవన్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన ద్వారకేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు మృతి