ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదుపుతప్పిన గ్యాస్ సిలిండర్ల లారీ.. డ్రైవర్ మృతి - అగ్రహారంలో లారీ డ్రైవర్ మృతి

గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్తున్న లారీకి ప్రమాదం జరగ్గా..డ్రైవర్ మృతిచెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని రొళ్ల మండలం అగ్రహారం గ్రామం వద్ద జరిగింది.

lorry driver died at agraharam
అగ్రహారంలో లారీ డ్రైవర్ మృతి

By

Published : Oct 26, 2020, 4:11 PM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని రొళ్ల మండలం అగ్రహారం గ్రామం వద్ద గ్యాస్ సిలిండర్లు లోడు తీసుకెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నవీన్ అనే డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలం వద్దకు చేరుకొని అక్కడ వాహన రాకపోకలను నిలిపివేశారు. గ్యాస్ నింపిన సిలిండర్లను అక్కడి నుంచి ఇతర వాహనాల్లో తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు.

ఇదీ చూడండి.ఆకివీడు పర్యటనలో నారా లోకేశ్‌కు తప్పిన ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details