అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్టూరు వద్ద లారీ అదుపుతప్పి రహదారి పక్కనున్న ఇంటిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గేదె దూడ మరణించగా.. మరో గేదె తీవ్రంగా గాయపడి మృతి చెందింది. రెండు గేదె దూడలకు గాయాలయ్యాయి. ఇల్లు స్వల్పంగా ధ్వంసం అయ్యింది. ఇంట్లో కుటుంబ సభ్యులు క్షేమంగా బయటపడ్డారు. డ్రైవర్ మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనం నడపడటం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపించారు. తమకు జీవనాధారమైన గేదెలు చనిపోయాయని.. అధికారులు స్పందించి నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇంటిపైకి దూసుకెళ్లిన లారీ.. తప్పిన పెను ప్రమాదం - lorry accident latest news update
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్టూరు వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది. లారీ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఇంటిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండు గేదెలు మరణించాయి.
ఇంటిలోకి దూసుకెళ్లిన లారీ