AMBULANCE: అనంతపురం రూరల్ కురుగుంట గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని సిమెంటు లోడుతో వెళ్తున్న ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన మహేశ్ అనే యువకుడు గాయపడ్డాడు. ఆ సమయంలో.. అనంతపురం నుంచి అదే రోడ్డు మార్గంలో రాయదుర్గం వెళ్తున్న ప్రభుత్వ విప్ కాపు రాంచంద్రారెడ్డి గాయపడిన యువకుడిని చూశారు. వెంటనే 108 వాహనానికి మూడు సార్లు తానే ఫోన్ చేసిన అంబులెన్స్ రాకపోవడంతో నిరాశ చెందారు.
ఒక ప్రజా ప్రతినిధి గాయపడిన వ్యక్తి కోసం అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే రాకపోవడం ఏంటని ఆంబులెన్స్ సిబ్బందిపై ఫోన్లో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు యువకుడిని చివరికి ప్రైవేటు వాహనంలో అక్కడి నుంచి చికిత్స నిమిత్తం తరలించారు.