అనంతపురం జిల్లా నార్పల నుంచి బొందలవాడ వద్ద వరిపొట్టు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నార్పల నుంచి ధర్మవరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు.
పాలకులు మారినా...మారని రహదారులు..నిత్యం ప్రమాదాలు
అనంతపురం జిల్లా నార్పల వద్ద లారీ బోల్తా పడింది. నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్థులు ఆరోపించారు. చిన్నపాటి వర్షానికే రోడ్డుపైన గుంతలు నిండిపోయి... ఎంత గొయ్యి ఉందో తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారని వాపోయారు.
బోల్తా పడిన లారీ
ప్రభుత్వ పాలకులు మారినా.. నార్పల రహదారికి మోక్షం లేదని గ్రామస్తులు వాపోయారు. నిత్యం ఏదో ఒక సమయంలో ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు వాపోయారు. చిన్నపాటి వర్షానికే రహదారి మెుత్తం బురదగా తయారవుతుందనీ... పెద్ద పెద్ద గుంతల్లో నీరు నిలిచిపోతుందన్నారు. గుంత ఎంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని గ్రామస్తులు వాపోయారు.
ఇదీ చదవండి:చికిత్స అందించలేదని గొంతు కోసుకున్న కరోనా బాధితుడు