అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లి సమీపంలో రెండు లారీలు ఢీకొని, ఓ డ్రైవర్ మృతి చెందాడు. మరణించిన డ్రైవర్‌ను... కర్నూలు జిల్లా నందికొట్కూరు వాసి బషీర్ అహమ్మద్‌గా పోలీసులు గుర్తించారు. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనటంతో ఇద్దరు డ్రైవర్లు వాహనాల్లోనే ఇరుక్కుపోయారు. స్థానికులు, పోలీసులు గంటల తరబడి శ్రమించి జేసీబీ సాయంతో వారిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన మహారాష్ట్రకు చెందిన మరో డ్రైవర్‌ను తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకువెళ్లారు. ప్రమాద కారణంగా చాలాసేపు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అనంత జిల్లాలో రెండు లారీలు ఢీ... డ్రైవర్ల నరకయాతన... - two lorrys accident in chimalavagupalli
అనంతపురం జిల్లా చీమలవాగుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొని ఓ డ్రైవర్ మృతి చెందాడు. లారీ క్యాబిన్లలో ఇద్దరు డ్రైవర్లు ఇరుక్కుపోయారు. జేసీబీలతో ఇద్దరినీ పోలీసులు బయటకు తీశారు.
అనంత జిల్లాలో రోడ్డు ప్రమాదం... రెండు లారీలు ఢీకొని ఓ డ్రైవర్ మృతి