ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళ్యాణదుర్గంలో డివైడర్​ను ఢీకొని లారీ బోల్తా... ఒకరికి గాయాలు - కళ్యాణదుర్దంలో లారీ ప్రమాదం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వద్ద ప్రమాదం జరిగింది. కళ్యాణదుర్గం నుంచి అనంతపురం విద్యుత్ కార్యాలయానికి ట్రాన్స్​ఫార్మర్​తో వస్తున్న లారీ... కళ్యాణదుర్గం సమీపంలో రహదారి విభాగినిని ఢీ కొట్టి బోల్తా పడింది. ఘటనలో లారీ డ్రైవర్​కు గాయలవగా.. ఆసుపత్రికి తరిలించారు.

lorry accident at kalyanadurgam in ananthapur
కళ్యాణదుర్గంలో డివైడర్​ను ఢీకొని లారీ బోల్తా

By

Published : Jul 29, 2020, 12:24 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కళ్యాణదుర్గం నుంచి అనంతపురం విద్యుత్ కార్యాలయానికి ట్రాన్స్​ఫార్మర్​తో వస్తున్న లారీ... కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలో రహదారి విభాగినిని ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటం, ఎదురుగా వాహనాలు రాని కారణంగా.. ప్రాణాపాయం తప్పింది. దారిలో లారీ అడ్డంగా పడిన పరిస్థితుల్లో గంట పాటు ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. ట్రాన్స్​ఫార్మర్ మరమ్మతులకు గురై అందులో ఉన్న ఆయిల్ మొత్తం రోడ్డుపై పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ నియంత్రించారు.

ABOUT THE AUTHOR

...view details