అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం చాగల్లు గ్రామంలో జరిగిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. 3 ఎకరాలు సాగు చేసుకుంటున్న శ్రీరాములు, పురుషోత్తంపై గుండాలతో దాడి చేయించి భూమి లాక్కోవాలని ప్రయత్నించారని.. ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వారి జీవనోపాధి కోసం గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని స్వాధీనపర్చుకునే హక్కు వైకాపా గూండాలకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
'భూమిని లాక్కునే హక్కు వారికి ఎవరిచ్చారు?' - నారా లోకేష్
'రాజారెడ్డి రాజ్యాంగంలో దళిత బిడ్డలకు బ్రతికే హక్కు లేదా అనేది జగన్ సమాధానం చెప్పాలి' అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు.

భూమిని లాక్కునే హక్కు గుండాలకు ఎవరిచ్చారు