ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్ మూర్ఖత్వానికి రోజూ వందలాది మంది బలి: లోకేశ్ - లోకేశ్ తాజా వార్తలు

ముఖ్యమంత్రి జగన్ మూర్ఖత్వానికి, అరాచ‌క‌ పాల‌న‌కు రోజూ వంద‌లాది మంది బ‌ల‌వుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తెదేపా నేత‌ల అక్రమ అరెస్టులపై చూపించే శ్రద్ధ..ప్రజల ప్రాణాలు కాపాడటంలో చూపించాలని హితవు పలికారు.

సీఎం జగన్ మార్ఖత్వానికి రోజూ వందలాది మంది బలి
సీఎం జగన్ మార్ఖత్వానికి రోజూ వందలాది మంది బలి

By

Published : May 12, 2021, 12:56 AM IST

ముఖ్యమంత్రి జగన్ మూర్ఖత్వానికి, అరాచ‌క‌ పాల‌న‌కు రోజూ వంద‌లాది మంది బ‌ల‌వుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. చేత‌గాని పాల‌న‌కు రుయాలో ఆక్సిజ‌న్ అంద‌క ప‌దుల‌ సంఖ్యలో కొవిడ్ రోగుల ఊపిరి ఆగిపోయిందని ఆయన మండిపడ్డారు. అనంత‌పురం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో వైద్యం అంద‌క రోగులు కుప్పకూలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల ఆర్తనాదాలతో గుండె చెదిరిపోతోందన్న లోకేశ్..,క‌ళ్లముందే ప్రజ‌ల‌ ప్రాణాలు పోతుంటే క‌న్నీళ్లు ఆగ‌టం లేదన్నారు.

అనంతపురంలో ప్రభుత్వాసుపత్రిలో ప్రాణాలు పోవ‌డానికి కూడా త‌మిళ‌నాడు నుంచి ఆక్సిజన్ ట్యాంక‌ర్ రాక‌పోవ‌డ‌మే కారణమా ? అని నిలదీశారు. "వినేవాళ్లు వైకాపా వాళ్లయితే..బాబాయ్ గుండెపోటు, కోడిక‌త్తి వంటి కథల్ని చెబుతారు" అని ఎద్దేవా చేశారు. తెదేపా నేత‌ల అక్రమ అరెస్టులపై చూపించే శ్రద్ధ..ప్రజల ప్రాణాలు కాపాడటంలో చూపించాలని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details