ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Lokesh:'ప్రశాంత రాష్ట్రాన్ని హత్యారాజకీయాలకు కేంద్రంగా మార్చేశారు'

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని వైకాపా నేతలు హత్యారాజకీయాలకు కేంద్రంగా మార్చేశారని తెదేపా నేత నారా లోకేశ్ దుయ్యబట్టారు. అనంతపురం జిల్లాలో తెదేపా కార్యకర్త గొల్ల గోపాల్ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రశాంత రాష్ట్రాన్ని హత్యారాజకీయాలకు కేంద్రంగా మార్చేశారు
ప్రశాంత రాష్ట్రాన్ని హత్యారాజకీయాలకు కేంద్రంగా మార్చేశారు

By

Published : Jun 8, 2021, 10:00 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్కాపురంలో తెదేపా కార్యకర్త గొల్ల గోపాల్​ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. వైకాపా నేతలే గోపాల్​ను హత్య చేశారని ఆయన ఆరోపించారు. మృతుని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

అధికారం చేతుల్లో ఉందని వైకాపా నేతలు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆక్షేపించారు. తెదేపా హయాంలో అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తే..వైకాపా పాలనలో హత్యలు, దోపిడీలు, అరాచకాలే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని హత్యారాజకీయాలకు కేంద్రంగా మార్చేశారని దుయ్యబట్టారు.

ఇదీచదవండి: 'జగన్ ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోంది'

ABOUT THE AUTHOR

...view details