ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్​ దండుపాళ్యం గ్యాంగ్.. పంక్చర్ దుకాణాన్నీ వదలట్లేదు' - వైకాపా ప్రభుత్వంపై లోకేశ్ కామంట్స్

అనంతపురం జిల్లా సోమందేపల్లిలో పంక్చర్ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న కాలాచారి కుటుంబాన్ని వైకాపా నాయకులు వేధించటం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. 'జగన్​రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్ పంక్చర్ దుకాణాన్ని కూడా వదలటం లేదు' అంటూ విమర్శించారు.

lokesh comments on puncture shop issue in anatapur
వైకాపాపై లోకేశ్ కామెంట్స్

By

Published : Jan 7, 2021, 4:24 PM IST

'జగన్​రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్ పంక్చర్ దుకాణాన్ని కూడా వదలటం లేదు' అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో పంక్చర్ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న కాలాచారి కుటుంబాన్ని వైకాపా నాయకులు వేధించటం దారుణమన్నారు. కుటుంబసభ్యులపై కేసులు బనాయించి, జీవనాధారమైన షాపును తొలగించాలని పోలీసులు ఒత్తిడి చేయటంతోనే కాలాచారి ఆత్మహత్యకు యత్నించారని మండిపడ్డారు.

వైకాపా రౌడీలతో కొంత మంది పోలీసులు కుమ్మక్కై సామాన్యులను హింసిస్తున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే జగన్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details