అనంతపురం జిల్లా బత్తలపల్లిలో అర్ధరాత్రి ఉమా లాడ్జిలో గది అద్దెకు కావాలని ముగ్గురు యువకులు వచ్చారు. మద్యం తాగి వచ్చిన వారికి గది అద్దెకు ఇవ్వమని మేనేజర్ ఈశ్వరయ్య (40) వారితో చెప్పాడు.
ఆగ్రహించిన యువకులు ఈశ్వరయ్యపై దాడికి దిగారు. గోడకు తల బాది చంపారు. నిందితులు ఓబులేసు, వినోద్, శ్రీనివాసులు ధర్మవరం పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. వారిపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.