కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్డౌన్ నిబంధనలు సడలిస్తూ.. అధికారులు అనుమతులిచ్చారు. పట్టణంలో కరోనా తీవ్రత దృష్ట్యా కొన్ని నెలలుగా లాక్డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనమతిచ్చారు. అయితే ఈ నిబంధనలతో తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు, దుకాణాదారులు పేర్కొన్నారు.
దసరా నేపథ్యంలోనేనా లాకౌడౌన్ సడలించాలని వాళ్లు స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఆశ్రయించారు. స్పందించిన ఎమ్మెల్యే.. వ్యాపారుల సమస్యలపై జిల్లా అధికారులతో మాట్లాడారు. ఈ మేరకు రాత్రి తొమ్మిది గంటల వరకు కొవిడ్ నిబంధనలతో వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చారు.