అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కరోనా కేసులు విపరీతంగా పెరగటంతో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా స్థానిక ఆర్దీవో కార్యాలయంలో కళ్యాణదుర్గం ఆర్దీవో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని అన్నీ వ్యాపార సముదాయాలు ఉదయం 10 గంటల వరకే తమ వ్యాపారాలను నిర్వహించుకోవాలని 10 గంటల తర్వాత వ్యాపార సంస్థలు విధిగా లాక్ డౌన్ పాటించాలని వ్యాపారస్థులకు సూచించారు.
నియమ నిబంధనలు పాటించని వ్యాపారస్థులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి శుక్ర, శని, ఆదివారం పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా బంద్ పాటించాలని విజ్ఞప్తి చేశారు.