కరోనా వైరస్ రైతుల పాలిట శాపంగా మారింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన కారణంగా రవాణా వ్యవస్థ స్తంభిచిపోయి పండిన పంట పొలాల్లోనే కుళ్లిపోతుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని పలు మండలాల్లో దాదాపు 1,261 హెక్టార్లలో దానిమ్మ, 321 హెక్టార్లలో అంజూర సాగు చేస్తున్నారు. పంటలు చేతికి వచ్చినా.. ఎగుమతులు లేక కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో బహిరంగ మార్కెట్లు మూసేయటంతో పంటలు అమ్ముకోలేని దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
లాక్డౌన్ ఎఫెక్ట్ : సంక్షోభంలో ఉద్యాన రైతులు - సంక్షోభంలో ఉద్యానవన రైతులు
ఉద్యాన పంటలు పండించే రైతులకు లాక్డౌన్ శరాఘాతంగా మారింది. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించి పండిన పంట అమ్ముకోలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
సంక్షోభంలో ఉద్యానవన రైతులు