లాక్డౌన్ సడలింపులతో అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం వద్ద మోపిడి గ్రామానికి చెందిన 500 మంది ఉపాధి కూలీలు పనులు చేపట్టారు. సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి పనులు చేశారు. ఏ గ్రామంలో చూసిన వ్యవసాయ కూలీలు పలుగూ పార చేత పట్టుకుని కూలి పనులు చేసుకుంటున్నారు. 80 రోజులుగా ఇంటి వద్దే ఉంటూ ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డ కూలీలకు చేతి నిండా పనులు దొరకడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
లాక్డౌన్ సడలింపులతో పనిలో ఉపాధి కూలీలు - employement workers latest news update
లాక్డౌన్తో పనులకు దూరమైన ఉపాధి కూలీలు తాజాగా ఇచ్చిన సడలింపుతో పనుల్లోకి వెళ్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో 500 మంది కూలీలు పలుగూ, పార పట్టుకొని పనులకు పయనమయ్యారు.
పనులు చేస్తున్న ఉపాధి కూలీలు