అనంతపురం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం పూర్తిస్థాయి లాక్ డౌన్‌ను పోలీసులు అమలు చేయనున్నారు. ఆదివారం వస్తే ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. రద్దీని అరికట్టేందుకు లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం ప్రధాన కూడళ్ళలో ప్రజలకు అవగాహన కల్పించడం కోసం పోలీస్ వాహనాలతో ప్రదర్శన చేశారు. ప్రస్తుతం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ప్రజల రాకపోకలకు సడలింపు ఇచ్చిన అధికారులు.. శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అనవసరంగా రహదారులపై తిరగొద్దని హెచ్చరించారు.
పోలీసుల హెచ్చరిక: ఆదివారం పూర్తిస్థాయి లాక్డౌన్ - అనంతపురం జిల్లాలో కరోనా కేసులు
అనంతపురం జిల్లాలో ఆదివారం పూర్తిస్థాయి లాక్డౌన్ ను విధిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావద్దని పోలీసు వాహనాలతో ప్రదర్శన చేస్తూ అవగాహన కల్పించారు.
lock down in ananthapuram