అనంతపురం జిల్లాలో లాక్ డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఆదివారం 24 గంటల లాక్ డౌన్ ను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించించటంతో పోలీసులు పకడ్బందీగా అమలుపరుస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని పోలీసులు హెచ్చరించినా... కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయిలో లాక్ డౌన్‌ను అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతపురం నగరంలో కొంతమంది అనవసరంగా రోడ్లపైకి వస్తుంటే డీఎస్పీ వీరరారాఘవ రెడ్డి సూచనలు ఇస్తూ... హెచ్చరిస్తున్నారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు బాధ్యతగా వ్యవహరించి... ఇళ్లలోనే ఉండాలని కోరారు.
అనంతపురంలో కట్టుదిట్టంగా 24 గంటల లాక్డౌన్ - అనంతపురం వార్తలు
అనంతపురం జిల్లాలో లాక్ డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఆదివారం 24 గంటల లాక్ డౌన్ ను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించించటంతో పోలీసులు పకడ్బందీగా అమలుపరుస్తున్నారు.
అనంతపురంలో 24గంటల లాక్డౌన్
ఇదీ చదవండి: