అనంతపురం జిల్లా హిందూపురం ప్రజలకు కొంత ఊరట లభించింది. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలు మినహా, మిగిలిన ప్రాంతాల్లో నేటి నుంచి మినహాయింపులు ఇస్తున్నట్లు సబ్‌కలెక్టర్ నిశాంతి వెల్లడించారు.
మెుదటి దశలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటిగంట వరకు నిత్యావసర వస్తువులు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. దుకాణాల వద్ద మాస్కులు, శానిటైజర్, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాస్కులు లేకుండా ఏ దుకాణదారుడైనా అమ్మకాలు జరిపితే ఆ షాపును 3 రోజులు పాటు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. దుకాణాలకు వచ్చే ప్రతి ఒక్క వినియోగదారుడి వివరాలు నమోదు చేయాలన్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 18 వార్డులు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఈ సడలింపులు వర్తిస్తాయని తెలిపారు.
- సడలింపులు ఉన్న ప్రాంతాలు
చౌడేశ్వరి కాలనీ, ఆబాద్పేట, ధర్మపురం-1, శ్రీకంఠపురం, లక్ష్మీపురం, సడ్లపల్లి, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కోట-2, బోయపేట, నింకంపల్లి-1, మోతుకపల్లి, దండురోడ్డు, అరవింద నగరే, ముదిరెడ్డిపల్లి-1, సింగరెడ్డిపల్లి
- కంటైన్మెంట్ పరిధి తగ్గిస్తున్న ప్రాంతాలు