అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని పలు గ్రామాల రైతులు అరటి సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. చేతికొచ్చిన పంటను అమ్ముకుని అప్పులనుంచి బయటపడదామని అనుకున్న సమయంలో... లాక్డౌన్ కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడం, రవాణా సౌకర్యాల లేమి, అకాల వర్షాలతో అన్నదాతలు కుదేలవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నష్టపోయిన తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అన్నదాతలపై కరోనా పిడుగు - అనంతపురం జిల్లాలో లాక్డౌన్ ప్రభావం
కరోనా వైరస్ రైతన్నలను సంక్షోభంలోకి నెట్టి కన్నీటిని మిగులుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ఫలితంగా రవాణా స్తంభించింది. దీంతో రైతులు పండించిన పంటను విక్రయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అనంతపురం జిల్లాలో నేలరాలిన బత్తాయి.