అనంతపురంలో మళ్లీ లాక్డౌన్..! - corona latest updates in ananthapuram
కరోనా వ్యాప్తి దృష్ట్యా అనంతపురంలో ఈరోజు నుంచి వారంపాటు లాక్డౌన్ అమలు చేయనున్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే సడలింపు ఇచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.
![అనంతపురంలో మళ్లీ లాక్డౌన్..! అనంతపురంలో మళ్లీ లాక్డౌన్ అమలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7709852-447-7709852-1592733341559.jpg)
అనంతపురంలో మళ్లీ లాక్డౌన్ అమలు
అనంతపురంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వారంరోజులపాటు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈరోజు నుంచి ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే సడలింపులు ఇచ్చారు. వ్యాపారులు, ప్రజలు, వాహనదారులకు ముందుగానే సమాచారం ఇచ్చినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనంపై ఒకరు మాత్రమే వెళ్లాలని సూచించారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.