ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్మశానంలో సగం కాలిన మృతదేహం... పరుగులు తీసిన స్థానికులు - Anantapur latest news

అనంతపురం నగరంలోని ఓ శ్మశాన వాటిలో సగం కాలిన మృతదేహం కలకలం రేపింది. మృతదేహాన్ని చూసిన ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

half a burnt body
half a burnt body

By

Published : Oct 4, 2021, 2:06 PM IST

అనంతపురం నగరంలోని శ్మశానవాటికలో దారుణం చోటుచేసుకుంది. సగం కాలిన గుర్తు తెలియని మృతదేహం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటనపై స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. మృతి చెందిన వ్యక్తిని కాల్చి తీసుకువచ్చి హిందూ శ్మశాన వాటికలో పడేశారా? పూడ్చే ఓపిక లేక అలా పడేసారా? అని అనుమానాలు వ్యక్తం చేశారు.

వచ్చే అమావాస్యకు పెద్దల పండుగ ఉండటంతో జనం సమాధుల చుట్టూ ముళ్ల పొదలు తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో సగం కాలిన వ్యక్తి మృతదేహాన్ని చూసి భయంతో పరుగులు తీశారు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చినా.. స్పందించక పోవటంతో స్థానికులే కాటి కాపరితో మృతదేహాన్ని పూడ్చివేశారు.

ఇదీ చదవండి:ప్రమాదవశాత్తు చెరువులో పడి బీటెక్ విద్యార్థి మృతి

ABOUT THE AUTHOR

...view details