ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటి సమస్య తీర్చాలంటూ మడకశిరలో మహిళల నిరసన - నీటి సమస్య పై మడకశిర మహిళల నిరసన

మడకశిరలో నీటి సమస్య తీర్చాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట స్థానిక మహిళలు నిరసన వ్యక్తం చేశారు. వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

local womens  protest
నీటి సమస్య పై మడకశిరలో మహిళల నిరసన

By

Published : Jan 12, 2021, 9:04 AM IST

అనంతపురం జిల్లా మడకశిరలో నీటి సమస్య తీర్చాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళలు బైఠాయించారు. తమ కాలనీలో నీటి బోరు మరమ్మతుకు గురై నెల రోజుల గడుస్తున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వార్డు సచివాలయాల్లో పలుమార్లు సమస్య గురించి వివరించినా.. ఎవరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు నీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చిన మేరకు.. ఆందోళన చేస్తున్న మహిళలు శాంతించి వెనుదిరిగారు.

ABOUT THE AUTHOR

...view details