అనంతపురం జిల్లా కదిరిలోని వలిసాబ్ వీధిలో మందుబాబులు, స్థానికుల మధ్య ఘర్షణ జరిగింది. కొందరు యువకులు మద్యం సేవించి నివాసాల మధ్య అల్లరి చేస్తున్నారు. ఇది గమనించిన కొందరు స్థానిక యువకులు వారిని వారించారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాట పెరిగి ఘర్షనకు దారి తీసింది. ఈ నేపథ్యంలోగౌస్ అనే వ్యక్తిపై స్థానిక యువకుడు నూరాన్ కత్తితో దాడికి పాల్పడ్డారు. గాయపడిన గౌస్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మందేసి చిందులేసిన యువకుడు..దాడి చేసిన స్థానికుడు - kadiri mandal
కదిరి వలిసాబ్ వీధిలో కొంతమంది యువకులు మద్యం తాగి చిందులేశారు. నివాసాల మధ్య అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిని స్థానికులు మందలించే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. చివరికి గౌస్ అనే వ్యక్తిపై నూరాన్ అనే యువకుడు దాడి చేశాడు.
తాగి గోల చేసిన యువకులు... కత్తిని వీపులోకి దింపిన స్థానికుడు