అనంతపురం జిల్లా కదిరిలో.. అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. హిందూపురం రోడ్లో.. ఎస్ఐ మహ్మద్ రఫీ సిబ్బందితో వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా.. ఆటోలో తరలిస్తున్న మద్యాన్ని గుర్తించి.. నిందితులను అరెస్టు చేశారు. కదిరి పట్టణానికి చెందిన ఇద్దరు.. కర్ణాటక నుంచి టెట్రాప్యాకెట్లు, మద్యం తీసికొచ్చి అధిక ధరలకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి1900 మద్యం టెట్రా ప్యాకెట్లు , 18 బాటిల్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం - అనంతపురంలో కర్ణాటక మద్యం స్వాధీనం
అనంతపురం జిల్లా కదిరిలో.. అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 1900 మద్యం టెట్రా ప్యాకెట్లు, 18 బాటిల్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
కదిరిలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం