అనంతపురం జిల్లా గుత్తి మండలంలో సారా తయారీ శిబిరాలపై పోలీసులు దాడులు చేశారు. గ్రామాల్లో సారా కాస్తున్నారన్న సమాచారంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు... పోలీసులు, సెబ్ అధికారులు కలిసి సంయుక్తంగా కలిసి ఈ దాడులు చేశామని గుత్తి సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు. గుత్తి మండలంలోని జక్కలచెరువు, ఎంగిలిబండ గ్రామ సమీపంలోని కొండ గుట్టల్లో నాటుసారా తయారు చేస్తున్న శిబిరాలలో సుమారు 6500 వేల లీటర్ల నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. ఎవరైనా సారా అక్రమంగా నిలువ ఉంచినా, తయారు చేసిన, అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సారా తయారీ శిబిరాలపై పోలీసులు, సెబ్ అధికారుల దాడులు - అనంతపురంలో నాటుసారా తయారీ శిబిరాల్లో పోలీసుల దాడులు
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని జక్కలచెరువు, ఎంగిలిబండ గ్రామ సమీపంలోని కొండ గుట్టల్లో సారా తయారీ స్థావరాలపై పోలీసులు, సెబ్ అధికారులు దాడులు చేశారు. ఎవరైనా అక్రమంగా సారా తయారు చేసినా, దాన్ని అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
నాటుసారా తయారీ శిబిరాల్లో పోలీసులు, సెబ్ అధికారుల దాడులు