అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఓ కోతి పిల్ల మృతి చెందింది. ఇది తెలియని తల్లి కోతి.. తన పిల్లను కదిలించేందుకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎంతగానో ప్రయత్నించింది.
ఎంతకూ ఆ పిల్ల కోతి కదలకపోయేసరికి... పిల్లను ఒళ్లో పెట్టుకుని తల్లి కోతి ఎంతగానో రోదించింది. మిగతా కోతులు సైతం అక్కడకు చేరుకున్నాయి. చివరకు పిల్లను తీసుకుని తల్లి వానరం చెట్టుపైకి వెళ్లింది. తల్లి కోతి ప్రేమను చూసినవారంతా కంటతడిపెట్టారు.