కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఆ ప్రభావం ఆర్టీసీ బస్సులపై పడింది. అనంతపురం జిల్లా కదిరి బస్ డిపో అధికారులు నాలుగో వంతు బస్సులను మాత్రమే నడిపారు. డిపో పరిధిలో రోజూ 110 బస్సులు తిరుగుతుండగా.. ఇవాళ మాత్రం కేవలం 30 బస్సులను మాత్రమే నడిపారు. బస్సు సర్వీసులు తక్కువగా ఉన్న కారణంగా.. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్ స్టాండ్లో ఎక్కువసేపు నిరీక్షించాల్సి వచ్చింది.
కరోనా కట్టడికి కర్ఫ్యూ.. పరిమితి సంఖ్యలో బస్సుల రాకపోకలు - అనంతపురం తాజా వార్తలు
కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూను అమలు చేస్తోంది. అందులో భాగంగా అత్యవసర సేవలు మినహా మిగతా కార్యకలాపాలను పన్నెండు గంటలకే మూసి వేయాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అనంతపురం జిల్లా కదిరి ఆర్టీసీ పరిమితి సంఖ్యలో బస్సలు నడిపింది.

kadiri bus depot
Last Updated : May 5, 2021, 9:37 PM IST