తేలికపాటి వర్షంతో రైతుల్లో అనందం - కళ్యాణదుర్గంలో తేలికపాటి వర్షం
తేలికపాటి వర్షంతో కళ్యాణదుర్గం, బెలుగుప్ప మండలాల రైతుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తమకు ఉపశమనం లభించిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లాలో తేలికపాటి వర్షం
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, బెలుగుప్ప మండలాల సరిహద్దుల్లో తేలికపాటి వర్షంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. గత మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గ్రామీణులకు ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం ఊరటనిచ్చింది. తేలికపాటి వర్షంతో నరసాపురం, పులికల్లు గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.