Leprosy patients: అనంతపురం జిల్లా కూడేరు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని లెప్రసీ కాలనీలో నివసించే బాధితులు మూకుమ్మడిగా సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. ‘మాకు వేలిముద్రలు వేసే అవకాశం లేనందున వీఆర్వో పేరు మా రేషనుకార్డుల్లో నమోదు చేశారు. ఇన్నాళ్లూ ఆయన వేలిముద్రలతోనే పింఛను ఇస్తున్నారు. కార్డులో ప్రభుత్వ ఉద్యోగి పేరు ఉందంటూ మాకు పింఛను తీసేశారు’ అని బాధితుల సంఘం నాయకుడు రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు శ్యామల, సారంబి, శ్రీరాములు తదితరుల పేర్లు జాబితాలో లేవన్నారు. పింఛను పునరుద్ధరించాలని కోరారు. పూర్వపు కలెక్టర్ సోమేశ్‌కుమార్ ప్రోత్సాహంతో 30 ఎకరాల్లో మామిడి, ఉసిరి, సపోటా తోటలను సాగు చేస్తున్నామని.. ఇటీవల గాలివానకు కాయలన్నీ రాలిపోయాయని చెప్పారు. నష్టపరిహారం ఇవ్వాలని విన్నవించారు.
Leprosy patients: కుష్ఠు రోగులమన్నా.. కనికరించలేదయ్యా - కూడేరులో కుష్ఠు రోగుల పింఛను ఆపేసిన అధికారులు
Leprosy patients: ‘కుష్ఠు రోగంతో బాధపడుతున్నాం. ఏ పనీ చేయలేని పరిస్థితుల్లో పూటగడవని మాకు పింఛనే ఆధారం. ఉన్నపళంగా అదీ తీసేశారు’.. అని బాధితులు కంటతడి పెట్టారు. తమ గోడును అధికారులకు విన్నవించారు.
కుష్ఠు రోగులు