లేపాక్షి ఉత్సవాలను వైభవంగా నిర్వహించబోతున్నామని అనంతపురం కలెక్టర్ తెలిపారు. సంస్కృతి అనే అంశం ఆధారంగా వేడుకలు జరుగుతాయన్నారు. ఈ నెల 7, 8వ తేదీల్లో జరిగే ఉత్సవాల్లో రెండు లక్షలకు పైగా పర్యాటకులు పాల్గొంటారని అంచనా వేశారు. రాయలసీమ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పటం.. ప్రత్యేక వంటకాలు అందుబాటులో ఉంచడం వంటివి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు. పర్యటక శాఖ ఎండీ ప్రవీణ్ కుమార్తో కలిసి లేపాక్షి పోస్టర్లను విడుదల చేశారు.
ప్రభుత్వం ఉత్సవాల కోసం కోటి రూపాయలు విడుదల చేయగా.... మరిన్ని నిధుల కోసం విజ్ఞప్తి చేసినట్లు పర్యటక శాఖ ఎండీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కరోనా వార్తల నేపథ్యంలో.. ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లు వివరించారు.