ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Leopards: చిరుతపులుల సంచారం... భయాందోళనలో ప్రజలు

అనంతపురం జిల్లా (anantapur district) కళ్యాణదుర్గం పట్టణ శివారులో చిరుతపులుల(Leopards) సంచారం కలకలం సృష్టించింది. సమీపంలో మేకల మందపై ఓ చిరుత దాడి చేసింది. చిరుత దాడితో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఊరుకొండలో మరో చిరుత దాడి చేసి ఓ ఆవుదూడను చంపేసింది.

Leopard
Leopard

By

Published : Oct 29, 2021, 10:31 AM IST

అనంతపురం జిల్లా(anantapur district) కళ్యాణదుర్గం పట్టణ శివార్లలోని కొండల్లో చిరుతల(Leopards) సంచారంతో పట్టణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పట్టణ శివార్లలోని అక్కమాంబ కొండపై ఉన్న చిరుత.. సమీపంలోని మేకల మందపై దాడి చేసి ఓ మేకను చంపేసింది. దీంతో అక్కమాంబ ఆలయంలోని పూజారులు ఆలయాన్ని ఖాళీ చేసి వెళ్లి పోయారు.

కళ్యాణదుర్గానికి మరో వైపు ఉన్న ఊరుకొండలో మరో చిరుత(Leopard) దాడి చేసి ఓ ఆవుదూడను చంపేసింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు చిరుతల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిరుతలను బంధించి జంతు ప్రదర్శనశాలకు తరలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:కౌలు భూమి తగాదా.. తెదేపా కార్యకర్తపై దాడి

ABOUT THE AUTHOR

...view details