అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గుళ్యపాలెం గ్రామంలో చిరుతపులి కలకలం(Leopard wandering in the Gulyapalem at Anantapur district ) సృష్టిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున గ్రామంలోకి చొరబడిన(Leopard wandering in the Gulyapalem ) చిరుత.. పోతన్న అనే రైతుకు చెందిన గొర్రెను ఎత్తుకెళ్లింది. చిరుత అడుగులను గుర్తించిన గ్రామస్థులు.. వెతుక్కుంటూ వెళ్లగా సమీప కొండ ప్రాంతంలో సగం తిని వదిలేసిన గొర్రె కళేబరాన్ని గుర్తించారు.
గొర్రె యజమాని సమాచారం మేరకు గ్రామానికి వచ్చిన పోలీసులు, అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. చిరుతపులి సంచారం(alerts to people due to Leopard wandering in Gulyapalem )తో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చిరుతను వీలైనంత త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు.
గతంలోనూ ఈ తరహా ఘటన..