అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివార్లలలో మేకల మందపై చిరుత దాడిచేసింది. ఈ ఘటనలో రెండు మేకలు మృతి చెందాయి. పట్టణానికి చెందిన నాగమ్మ, తిమ్మరాజులు తమకున్న మేకల్ని ఊరి శివార్లలో ఉన్న కొండ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లారు. సాయంకాలం తిరిగి మేకలను ఇంటికితీసుకు వస్తుండగా ..అక్కడే ఉన్న చిరుత వాటిపై దాడిచేసింది.
మేకలమందపై చిరుత దాడి.. ఆందోళనలో గ్రామస్థులు - Leopard news in kalyanadurgam
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివార్లలలో మేకల మందపై చిరుత దాడిచేసింది. ఈ ఘటనలో రెండు మేకలు మృతి చెందాయి.

మేకలమందపై చిరుత దాడి
ఈ ఘటనలో రెండుమేకలు మృతిచెందాయి. చిరుత దాడి చేసిన ప్రాంతం.. పట్టణానికి అతి సమీపంలో ఉండడంతో శివారుకోట కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుత ఈ ప్రాంతంలోనే సంచరిస్తుందని తెలిపారు.
ఇదీ చూడండి.కొండపై గుహలో పిల్లలు.. శ్రమించి రక్షించిన పోలీసులు