అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురం సమీపంలోని కొండపై చిరుత సంచరిస్తూ కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ సమీపంలోని చౌడమ్మ గుట్టపై చిరుత ఉండటాన్ని కొందరు యువకులు గమనించారు. ఈ దృశ్యాన్ని రోడ్డు పక్కన వెళుతున్న కొంతమంది యువకులు తమ చరవాణీల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అనంతలో చిరుత సంచారం... ఆందోళనలో స్థానికులు - anantapur distrct latest news
అనంతపురం జిల్లా బహ్మసముద్రం మండలం పాలవెంకటాపురంలో చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామ సమీపంలోని కొండపై చిరుత సంచరిస్తూ కనిపించటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
చిరుత సంచారం
ఇటీవల కళ్యాణదుర్గం అటవీ ప్రాంతంలో అడవి జంతువుల బెడద అధికం అవుతోందని గ్రామస్థులు తెలిపారు. పలుచోట్ల చిరుత దాడి చేసి పశువులు, గొర్రెలను చంపేయడం.. ఎలుగుబంట్లు దాడులు చేసి రైతులను గాయపర్చడం తరచూ జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి