చిరుత సంచారంతో అనంతపురం జిల్లా బహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఎస్సీ కాలనీ శివారులోని కొండ ప్రాంతంలో పొదల మాటున దాగి ఉన్న చిరుతను కొంత మంది యువకులు తమ సెల్ఫోన్లలో బంధించారు. ఆ దృశ్యాలు స్థానికంగా వైరల్ అయ్యాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.
అనంతలో చిరుత సంచారం...భయాందోళనలో స్థానికులు - అనంతలో చిరుత సంచారం తాజా వార్తలు
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురంలో చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. ఎస్సీ కాలనీ శివారులోని కొండ ప్రాంతంలో పొదల మాటున కొంత మంది యువకులు చిరుతను గుర్తించటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
అనంతలో చిరుత సంచారం...భయాందోళనలో స్థానికులు