అనంతపురం జిల్లాలోని హిరెహాల్ గ్రామ సమీపంలోని ఆపిల్ ఫ్యాక్టరీ, సిద్దాపురం, సిద్దాపురం తాండ ఓబులాపురం, ఓఎంసీ, సుంకులమ్మ ఆలయం వద్ద చిరుతపులి సంచరిస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. చిరుత పులి సంచరించడంపై స్థానిక పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో డి హిరేహాల్ ఎస్ఐ వలిభాష, రాయదుర్గం ఫారెస్ట్ డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు, సిబ్బంది కలిసి ఆయా ప్రాంతాలను పరిశీలించగా చిరుత పులుల అడుగు జాడలు కనుగొన్నారు. తల్లిపులితో పాటు పులి పిల్ల సంచరిస్తున్నట్లు ధృవీకరించారు. దీంతో అటవీశాఖ అధికారులు, పోలీసులు సమీప అడవి ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేశారు.
అనంతలో చిరుత సంచారం.. భయం గుప్పెట్లో గ్రామస్థులు - tiger in anantapuram district news
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డీ.హిరెహాల్ మండలంలో గత కొద్ది రోజులుగా పలు ప్రాంతల్లో చిరుతపులి సంచరించడం ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేశారు.
అనంతలో చిరుత సంచారం
సిద్దాపురం, ఎస్ హెచ్ తండాల వద్ద ఉన్న పోలీస్ ఔట్ పోస్ట్ చెక్ పోస్టులు సిబ్బందికి పలుమార్లు పులులు కనిపించినట్లు చెప్పారు. ప్రజలు ఎవరు ఒంటరిగా అడవుల్లోకి వెళ్లవద్దని గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారులు సూచించారు. చిరుత వల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఉన్నట్లు వారు తెలిపారు.