అమరావతి పరిరక్షణ కోసం తెదేపా అధినేత చంద్రబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రేపు అనంతపురంలో పర్యటిస్తున్నట్లు.. అమరావతి రాజధాని పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని విద్యార్థి సంఘాలు, యువత మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురంలోని సీపీఐ కార్యాలయంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, తెదేపా జిల్లా అధ్యక్షుడు పార్థసారథితో కలసి ఆయన మాట్లాడారు.
రేపు అనంతపురంలో చంద్రబాబు పర్యటన - అనంతపురంలో చంద్రబాబు పర్యటన న్యూస్
అమరావతి పరిరక్షణ కోసం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రేపు అనంతపురంలో పర్యటించనున్నారు.
రాజధాని పరిరక్షణ కోసం అనంతపురంలో వామపక్షాల సమావేశం