మున్సిపాలిటీల్లో పన్నుల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వివిధ రాజయకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఆస్తి పన్నులు పెంపును నిరసిస్తూ చేపట్టాల్సిన కార్యాచరణపై అనంతపురం జిల్లా కదిరిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పన్నుల పెంపు విషయంలో ప్రభుత్వ తీరును సమావేశంలో ఎండగట్టారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని... రాష్ట్ర ప్రభుత్వం పన్నులు పెంచి ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. పన్నుల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు తీర్మానించారు. సమావేశంలో వామపక్ష పార్టీలతో పాటు తెదేపా, కాంగ్రెస్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
'పన్నుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి' - అనంతపురంలో ఇంట పన్నుల పెంపును నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆందోళన
మున్సిపాలిటీల్లో పన్నుల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని వివిధ పార్టీల నాయకులు తీర్మానించారు. ఆస్తి పన్నులు పెంపును నిరసిస్తూ చేపట్టాల్సిన కార్యాచరణపై అనంతపురం జిల్లా కదిరిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
పన్నుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి