కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అనంతపురంలో వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద రైతు సంఘాలు, సీపీఎం, సీఐటీయూ అనుబంధ సంఘాలతో ధర్నా నిర్వహించారు. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలని.. కేరళ తరహా రైతు విమోచన చట్టాన్ని అమలు చేయాలన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు.