ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

‘జీవో నెంబరు 22ను రద్దు చేయండి’ - ధర్మవరం తహసీల్దార్​ కార్యాలయం వద్ద వామపక్షాలు ధర్నా

జీవో నెంబరు 22ను వెంటనే రద్దు చేయాలంటూ ధర్మవరం తహసీల్దార్​ కార్యాలయం వద్ద వామపక్ష, కాంగ్రెస్​, రైతుల సంఘం నాయకులు ధర్నాకు దిగారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు అమీర్​ భాషా, సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు చలపతి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు భాష, పలువురు రైతులు పాల్గొన్నారు.

left parties protest at dharmavaram
తహసీల్దార్​ కార్యాలయం వద్ద వామపక్షాలు నిరసన

By

Published : Sep 25, 2020, 4:35 PM IST

ధర్మవరం తహసీల్దార్​ కార్యాలయం వద్ద వామపక్ష, కాంగ్రెస్​ పార్టీ, రైతు సంఘం నాయకులు నిరసనకు దిగారు. వ్యవసాయ బోరు బావులకు విద్యుత్​ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని ధర్నా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని వామపక్ష నాయకులు ఆరోపించారు. విద్యుత్​ మీటర్లు ఏర్పాటు చేస్తే రైతులకు రాబోయే రోజుల్లో భారం తప్పదన్నారు. వెంటనే జీవో నెంబరు 22 రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details