రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీలు నిరసన చేపట్టారు. లాక్ డౌన్‌తో పేదలు పనులు లేక ఇబ్బంది పడుతుంటే.. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి.. వారిపై భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎక్కువగా వచ్చిన విద్యుత్ బిల్లులను వామపక్ష నాయకులు విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట తగలబెట్టారు.
విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్షల నిరసన - LEFT PARTIES PROTEST AGAINST POWER BILLS
విద్యుత్ బిల్లుల పెంపునకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వామపక్షాలు నిరసన చేపట్టాయి. విద్యుత్ బిల్లులు తగ్గించాలని డిమాండ్ చేశాయి.

విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్షల నిరసన
TAGGED:
NEWS ON POWER BILLS IN AP